Tuesday, September 8, 2009

చదివిన తర్వాత ఇ-మెయిల్ మెసెజ్ కనిపించకుండా చెయలా?

మనం క్లయింట్లకు పంపించే మెయిల్ మెసేజ్‌లు ఒకసారి వారు చదివిన తర్వాత రెండవసారి చదవడానికి వీల్లేకుండా చేయవచ్చు. Gmail,Yahoo, Rediff వంటి మెయిల్ సర్వర్లలో నేరుగా ఇలా ఎక్స్ పైర్ అయిపోయే మెసేజ్‌లను పంపించడానికి అవకాశం లేదు. అయితే దీనికి దొడ్డిదారి ఉంది. సహజంగా ఒకసారి ఎవరైనా చూసిన తర్వాత ఇకపై ఆ పేజీ కనిపించని విధంగా HTML లాంగ్వేజ్ లో పేజీలను రూపొందించే మార్గముంది. ఈ టెక్నిక్‌ని ఆసరాగా చేసుకుని Kicknotes వంటి వెబ్ సైట్లో మనం టైప్ చేసే మెసేజ్‌ని, మనం పేర్కొన్న విధంగా ఎక్స్ పైర్ అయ్యే HTML లింక్‌గా మార్పిడి చేసి ఎవరికైతే మెయిల్ చేయదలుచుకున్నామో వారికి చేరవేయగలుగుతాయి.దాంతో మన మెసేజ్ అవతలి వారికి ఒక లింక్ రూపంలో పంపించడుతుంది. అయితే వారు ఆ లింక్‌ని మొదటిసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే అందులో మనం పంపిన మెసేజ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే .. "మెసేజ్ తొలగించబడింది" అని మొండి చేయి చూపిస్తుంది






http://www.kicknotes.com/

1 comment: